దేశంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. మానవత్వం ఉన్న మనుషులు కరువై కామాంధులు ఎక్కువవుతున్న తరుణంలో మహిళలకు కనీస రక్షణ కరువవుతోంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా తాతా-మనవళ్లు కలిసి ఓ ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది.
సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన పంజాబ్లో వెలుగులోకి వచ్చింది. ఆరుబయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని చూసి కామంతో ఊగిపోయిన తాతా-మనవళ్లు చిన్నారి ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశారు. ఇక బాధిత కుటుంబీకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారి మృతదేహం నిందితుల ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. ఫోక్సో చట్టం సహా వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.