కేసీఆర్ బర్త్ డే.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నంది నగర్ లోని వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ఇక అటు ఆస్ట్రేలియాలో కేసీఆర్ కు అరుదైన ఘనత దక్కింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, అడిలైడ్, బ్రిస్బెన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ్యులంతా కేసీఆర్ గారి దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వృక్షార్చనతో అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు.
కేసీఆర్ బర్త్ డే.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
కేసీఆర్ జన్మదినం సందర్భంగా నంది నగర్ లోని వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత#KCRBirthday#KCR #Kavitha… pic.twitter.com/x9nEP1oKfg
— Telugu Galaxy (@Telugu_Galaxy) February 17, 2025