ఇటీవలి కాలంలో మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నగరంలో ఇప్పటికే చాలావరకు గ్యాంగ్ రేప్‌లు, అత్యాచార ఘటనలు వెలుగుచూడగా.. తాజాగా మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది. వాష్‌రూమ్‌కు వెళ్లిన 20 ఏళ్ల యువతిపై మార్ట్‌లో పనిచేస్తున్న సూపర్ వైజర్ ఖాజా బషీర్ (35) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో జరిగింది.
ఈ ఘటన నెల కిందట జరగగా.. యువతి ఇటీవల కళ్లు తిరిగి పడిపోవడంతో పరీక్షలు నిర్వహించగా గర్బం దాల్చడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. యువతిని నిందితుడు బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదని సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బషీర్‌ను అరెస్టు చేశారు.ప్రస్తుతం విచారణ జరుగుతోందని వెల్లడించారు.