తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరు నుంచే రైతు భరోసా అమలు చేస్తామని తెలిపింది. నవంబరు చివరన రైతుల అకౌంట్లోకి రైతు భరోసా నగదు జమ అవుతుందని పేర్కొంది.
ఈ పథకం కింద ఎకరాకు రూ.7500 చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే రైతు భరోసా పథకం కింద పది ఎకరాలు ఉన్నవారికా? లేకపోతే ఏడున్నర ఎకరాలు ఉన్నవరకా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదని సెటైర్లు వేశారు కేటీఆర్. సీఎం కు చిత్తశుద్ది ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో 10 చోట్ల ఉప ఎన్నికలు తప్పవని.. డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు అన్నారు.