ఏపీలో దారుణం…మైన‌ర్ ను గ‌ర్బ‌వ‌తిని చేసిన మేన‌మామ‌..!

మైన‌ర్ బాలిక‌ల‌పై రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు బ‌య‌ట తిరుగుతున్న మాన‌వ మృగాల గురించి బ‌య‌ప‌డి చ‌స్తుంటే మ‌రోవైపు ఇంట్లోనే మాన‌వ మృగాలు సంచ‌రిస్తూ దారుణాల‌కు పాల్ప‌డుతున్నాయి. క‌న్న వారు…ర‌క్త సంబంధీకులే దారుణాల‌కు పాల్ప‌డుతుండ‌టం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇటీవ‌ల ఖ‌మ్మంలో మేన‌మామ ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌పై లైంగింక దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ దారుణం మ‌ర‌వ‌క‌ముందే మ‌రో దారుణం వెలుగులోకి వ‌చ్చింది.

child rape cases
child rape cases

ఏపీలో మైన‌ర్ బాలిక‌ను మేన‌మామ గ‌ర్బ‌వ‌తిని చేశాడు. కళ్యాణదుర్గం పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలికను 28 ఏళ్ల మేనమామ గ‌ర్భ‌వ‌తిని చేశాడు. మైనర్ బాలిక ప్ర‌స్తుతం 11 వారాల గర్భిణీ అని వైద్యులు నిర్దారించారు. ఈ ఘ‌ట‌న పై పోలీసులకు స‌మాచారం అంద‌డంతో నింధితున్ని అరెస్ట్ చేసి పోక్సో చ‌ట్టం కింద కేసు నమోదు చేశారు.