ఈ నెల 31 న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు పవన్‌ కళ్యాణ్‌

విశాఖ : ఈ నెల 31 వ తేదీన విశాఖ పట్టణానికి జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వనున్నారు జన సేనాని పవన్‌ కళ్యాణ్‌. ఈ నెల 31 వ తేదీన మధ్యాహ్నం రెండు గంట లకు స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ కు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు.

pawankalyan
pawankalyan

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి పవన్ కళ్యాణ్‌ మద్దతు తో కార్మికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీ లోని అన్ని పార్టీలు ఒక్కటైతే… కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే అవకాశాలు ఉంటాయని స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యం లో జనసేన పార్టీ అధినేత రావడం…. కార్మికుల్లో కాస్త భరోసా కలిగినట్లవుతుంది. కాగా…. గత కొన్ని రోజుల నుంచి పవన్‌ కళ్యాణ్‌.. వైసీపీ సర్కార్‌ కు వ్యతిరేకంగా ఏపీ అభివృద్ధిపై ఫైట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రోడ్ల మరమత్తు పై పోరాటం చేస్తోంది జనసేన పార్టీ.