అమానవీయం.. మైనర్​పై గ్యాంగ్​రేప్.. ప్రైవేటు భాగాలు కోసి..

-

బిహార్‌ సమస్తిపుర్​లో దారుణం జరిగింది. 13 ఏళ్ల మైనర్​ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాలు, నాలుక కోసి పైశాకి ఆనందం పొందారు. ఈనెల 11న జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

“కళ్యాణ్​పుర్​కు చెందిన బాలికను ఇంటిలో నుంచి ఎత్తుకెళ్లిపోయారు నిందితులు. పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేసి.. విచక్షణా రహితంగా దాడి చేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గమనించిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విరాళాలు సేకరించి బాలికకు వైద్యం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి విషమంగా ఉంది” అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీపీఐ(ఎంఎల్​) నేతలు.. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను పోలీసులు త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అత్యాచార ఘటనపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెక్మెహ్సీ పోలీసులు తెలిపారు. నిందితులిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version