రెయిన్ బో.. ఇంద్రధనస్సు. ప్రకృతి వడిలో జరిగే అద్భుతమైన ఒక చర్య. దీన్ని చూడటానికి చిన్నా, పెద్ద అందరూ ఆసక్తి చూపిస్తారు. ఇది మనం ఎప్పుడంటే అప్పుడు రాదు. ప్రకృతిలో జరిగే మార్పులతో అప్పుడప్పుడు ఇది ఆకాశంలో కన్పిస్తుంది. సాధారణంగా మనం అర్ధచంద్రాకారంలో ఇంద్రధనస్సును చూస్తాం. అత్యంత అరుదుగా పూర్తిస్థాయి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పూర్తి ఇంద్రధనుస్సు కనిపించి ప్రజలను అశ్చర్యచకితులను చేసింది, ఇటువంటి ఇంద్రధనుస్సు ప్రతీ100-200 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కింది వీడియోలో దీన్ని చూడవచ్చు.
ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది?
సాధారణంగా సూర్యుడికి అభిముఖంగా అంటే వ్యతిరేక దిశలో ఆకాశంలోని నీటిబిందువులపై (మేఘాలు, మబ్బులు) సూర్యరశ్మి 45 డిగ్రీల కోణంలో పడితే ఏడురంగుల విబిజియార్ అంటే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
– కేశవ