కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇద్దరు యువకులు అతివేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి వృద్ధుడు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు.ఈ ఘటనలో వృద్ఢుడు వెనుకకు తిరిగి పడిపోగా.. ఇద్దరు యువకుల్లో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి ప్యాసింజర్స్ సదరు వృద్ధుడిని, గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా, ప్రమాదానికి కారణమైన బైకర్ ఫ్రెండ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను భయంతో పారిపోయినట్లు తెలిసింది. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.