ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నది. ఈ సినిమా మే 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అయితే, ఈరోజు ఉగాది స్పెషల్‌గా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హ్యాండ్‌లో కత్తి పట్టుకుని చాలా అగ్రెసివ్‌గా ఉన్నాడు. అదేవిధంగా రెడ్ కలర్ షర్ట్, లుంగీ మెడ చుట్టూ బ్లాక్ కలర్ తువాలుతో దర్శనమిచ్చాడు.
ఇక రైట్ హ్యాండ్‌లో కడియం, పెద్ద మీసాలు టోటల్‌గా ఓ యుద్ధ వీరుడిలా కనిపిస్తున్నాడు. ఇక ఈపోస్టర్‌కు ‘ధర్మం కోసం యుద్ధం’ అనే క్యాప్షన్ కూడా జోడించారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా పోస్టర్ విడుదల అయ్యిందో లేదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దానిని వైరల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
A tale of bravery, a battle for dharma, and a warrior who stands tall! ⚔️🔥
Get ready to witness the saga of #HariHaraVeeraMallu unfold in all its grandeur. 💥💥#ఉగాదిశుభాకాంక్షలు – #HappyUgadi from Team #HHVM
Storming in cinemas 9th May, 2025. #HHVMonMay9th 💥💥
Powerstar… pic.twitter.com/FufK9Inz5y
— BA Raju's Team (@baraju_SuperHit) March 30, 2025