ఏప్రిల్ 1వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.ఈ సందర్బంగా చినగంజాం మండలం చిన్న గొల్లపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. అనంతరం ప్రజా వేదిక ద్వారా ప్రజలనుద్దేశించి సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఉండనుంది.
సభ పూర్తి కాగానే గంట పాటు పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారని సమాచారం.అనంతరం జిల్లా అధికారులతోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అయితే, సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో బాపట్లలో తెలుగుదేశం పార్టీ నేతలు, కేడర్ ప్రత్యేకంగా ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.