ఓ ఇంటివాడైన రషీద్ ఖాన్.. కాబూల్‌లో ఘనంగా వేడుకలు!

-

అఫ్గ‌నిస్థాన్ స్టార్ స్పిన్నర్ ర‌షీద్‌ఖాన్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడ‌య్యాడు.అఫ్గ‌న్ రాజ‌ధాని కాబూల్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ర‌షీద్ ‌ఖాన్ పెళ్లి వేడుక‌లు జ‌రిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఫాష్తూన్స్ సంప్ర‌దాయం ప్ర‌కారం ర‌షీద్ ఖాన్ పెళ్లి జ‌రిగింది.ర‌షీద్ పెళ్లికి ప‌లువురు అఫ్గ‌నిస్థాన్ క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు.పెళ్లి వేడుక‌లో సంద‌డి చేశారు. ర‌షీద్‌ఖాన్‌కు ప‌లువురు క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు సైతం శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు.

రషీద్ ఖాన్ అఫ్గ‌నిస్థాన్ జట్టు త‌ర‌ఫున ఇప్పటిరకు 105 వ‌న్డేలు ఆడి 190 వికెట్లు తీసుకున్నాడు.ఐదు వికెట్ల‌ను 5 సార్లు కొల్లగొట్టాడు.బ్యాటింగ్‌లో రాణించిన ర‌షీద్‌ఖాన్ వ‌న్డేల్లో 5 హాఫ్ సెంచ‌రీలు కలిపి 1,322 ర న్స్ చేశాడు. ఇక టీ20 క్రికెట్‌లో మెరుగైన రికార్డు ఉంది.ఐసీసీ టీ20 ఆల్‌రౌండ‌ర్స్ ర్యాంకింగ్స్‌లో ర‌షీద్‌కాన్ టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు.కెరీర్‌లో 93 టీ20 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్‌ 152 వికెట్ల‌తో పాటు 460 ర‌న్స్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version