రష్మిక నిజంగా లక్కీనే.. లేదంటే ఇంత తొందరగా ఆ అవకాశం అందుతుందా..?

-

ఛలో సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రష్మిక మందన్న ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో స్టార్ గా మారిపోయింది. దాంతో ఆమెకి ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తెలుగులో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మిక మందన్న అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ఉంది. ఐతే రష్మికకి తాజాగా బాలీవుడ్ లో అవకశం వచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది.

శంతను బగ్చి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయమై ఈ రోజు మిషన్ మజ్ను ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఉగ్రవాద కార్యకలాపాలు, యాక్షన్ సీన్లు గుర్తుకు వస్తున్నాయి. సినిమా పూర్తిగా హై యాక్షన్ డ్రామాగా ఉండేట్టు తెలుస్తుంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి తెలుగులో స్టార్ గా ఎదుగుతున్న రష్మికాకి బాలీవుడ్ లో అదృష్టం కలిసి వస్తుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news