సంక్రాంతి పండుగ వేళ మార్కెట్ లో అన్ని వస్తువులు రేట్లు పెరుగుతున్నాయి దీంతో వరంగల్ ప్రజల గుండెలు గుబేలుమంటున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు ధరల భయం పట్టుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధారణ మార్కెట్ ధరలను చుస్తే కంది పప్పు, మినప పప్పు, కిలో రూ.110, శనగ పప్పు రూ.80లుగా ఉంది. వంట నూనెల ధరలు కొంత దిగొచ్చినా, గ్యాస్ ధర మాత్రం రూ.వెయ్యికి చేరింది. సంక్రాంతి పిండి వంటలపై ధరల ప్రభావం చూపుతోంది. ధరల కట్టడికి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.