రేషన్ బియ్యం పంపిణీపై తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ దుకాణాల్లో లబ్దిదారులు బియ్యం వద్దనుకుంటే.. డబ్బులు ఇచ్చే నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టడానికి సీఎం జగన్ సిద్దం అయ్యారు.
వచ్చే నెల నుంచే ఈ నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ప్రయోగాత్మకంగా గాజువాక, అనకాపల్లిలో ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పరిశీలిస్తోంది. నేటి నుంచే లబ్ది దారుల అంగీకారం తీసుకునేందుకు సర్వే నిర్వహించనుంది. ఈ నగదు బదిలీ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద అనకాపల్లీ, నంద్యాల, కాకినాడ, నర్సాపురం, గాజువాకలను ఎంచుకొని అమలు చేయనున్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం వద్దు అనుకునే లబ్ధిదారులకు.. కిలో బియ్యానికి రూ. 12 నుంచి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉంది.