తను అరెస్ట్ కాకముందే.. రెండు సార్లు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా.. కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. ముచ్చటగా మూడోసారి ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది.
ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీవీ9ను టేకోవర్ చేసిన అలంద మీడియా రవిప్రకాశ్‌పై చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
అయితే.. తను అరెస్ట్ కాకముందే.. రెండు సార్లు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా.. కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. ముచ్చటగా మూడోసారి ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే.. ఆ బెయిల్‌ను కొన్ని షరతులతో మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదు. పోలీసుల విచారణకు సహకరించాలి. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరుకావాలంటూ హైకోర్టు రవిప్రకాశ్‌కు కొన్ని షరతులు విధించింది.