ర‌వితేజ ‘ డిస్కోరాజా ‘ స్టోరీ లీక్‌… లైన్ ఇదే..!

-

మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ మూడేళ్ల క్రితం వ‌చ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టాడు. అప్ప‌టి నుంచి ర‌వితేజ చేసిన సినిమాలు అన్ని వ‌రుస‌పెట్టి ప్లాపులు అయ్యాయి. ఈ సినిమాలు ప్లాప్ అయ్యాయి అనేకంటే ఘోర‌మైన డిజాస్ట‌ర్లు అయ్యాయనే చెప్పాలి.  ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలు భారీ డిజాస్టర్లు కావడంతో రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘డిస్కో రాజా’ సినిమాపైనే పెట్టుకున్నాడు రవితేజ.

నిఖిల్ హీరోగా వ‌చ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ ఇదేనంటూ ఈ సినిమా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి అనేక వార్త‌లు మీడియాలోనూ, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా లీక్ అయిన ఓ ఫొటోను బ‌ట్టి డిస్కోరాజా క‌థ ఇదేనంటూ మ‌రో లైన్ ట్రెండ్ అవుతోంది.

ఈ సినిమా కథలో ఒక ముసలి వ్యక్తి కనిపించకుండా పోయి మళ్ళీ పగ తీర్చుకోవడం కోసం ఒక యువకుడిగా వస్తాడు. ఇప్పుడు లీక్ అయిన ఫొటోలో యంగ్ గా కనిపిస్తున్న రవితేజ ఒక ముసలి వ్యక్తి తో సినిమా సెల్ఫీ తీసుకుంటూ కనిపిస్తాడు. ఇది మేక‌ప్పా… లేదా ఫేస్ యాప్పా అన్న‌ది క్లారిటీ లేదు. అయితే సినిమా క‌థ ఇదే అంటూ లీక్ అయిన లైన్‌… ఫొటోను బ‌ట్టి చూస్తే కొంత నిజ‌మే అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version