ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరుగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రస్తుతం గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకునే సమయంలో కొందరూ విద్యార్థులు తమ వివరాలను తప్పుగా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు వారికి మరో అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. తప్పులను ఎడిట్ చేసుకోవడానికి ఈనెల 19 నుంచి 23 వరకు ఛాన్స్ ఇస్తున్నట్టు పేర్కొంది.
విద్యార్జి పేరు, పేరెంట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీడియం వంటి వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని స్కూల్ హౌస్ మాస్టర్ తమ ఆన్ లైన్ లాగిన్ ద్వారా తప్పుల సవరణలు చేయవచ్చని వెల్లడించింది. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న ఇంగ్లీషు, మార్చి 24న మ్యాథ్స్, మార్చి 26న ఫిజిక్స్, 28న బయాలజీ, మార్చి 29న ఒకేషనల్, మార్చి 31న సోషల్ స్టడీస్