కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ దోచుకుందని.. రోడ్లు వేయలేదని మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. హరీశ్ రావు స్పందిస్తూ.. రోడ్ల పై నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు అసెంబ్లీ దగ్గర చేయాలన్నారు. కొందరూ సభ్యులు తాగొచ్చి సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేసారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీశ్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ వద్ద డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు సీఎం కి అభ్యంతరం లేదన్నారు. ఎందుకు అంటే ఆయన తాగడు.. ప్లాబ్లమంతా హరీశ్ రావు కే వస్తుంది. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తే.. ఇంకెప్పుడు రాడు అని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. హరీశ్ రావు తొందరపడి అడిగాడు.. కానీ ఆయనను కేసీఆర్ తిడతాడని సెటైర్లు వేశారు.