అంబేద్కర్ పేరు ఎత్తితే అమిత్ షాకు వణుకు.. అద్దంకి దయాకర్ ఆసక్తికర కామెంట్స్

-

అంబేద్కర్ పేరు ఎత్తితే హోంమంత్రి అమిత్ షా కు వణుకు పడుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. పార్లమెంట్ లో అమిత్ షా ప్రసంగం పై స్పందించారు. ట్విట్టర్ వేదిక గా వీడియో విడుదల చేశారు. అంబేద్కర్ బదులు ఇన్ని సార్లు దేవుడి పేరు ఎత్తితే స్వర్గంలో ఉండేవారని అమిత్ షా అంటున్నాడని.. అలాంటి వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవిస్తాడంట ఎవరు నమ్ముతారని పేర్కొన్నారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ ని అవమానిస్తున్నారంటే అమిత్ షా రూపంలో చూడవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమిత్ షా కు అంబేద్కర్ పేరు ఎత్తితే ఎందుకు వణుకు పుడుతుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల హోంమంత్రి ఆయన అమిత్ షా రాజకీయాలకు అవసరమా..? అని మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి వ్యక్తులను కేంద్ర మంత్రులను చేసి అంబేద్కర్ భావజాలన్ని అణిచి వేసే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version