Ravi Teja: క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న మాస్ మ‌హారాజ్!

-

Ravi Teja: టాలీవుడ్ స్టార్ హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ ఒకరూ. క్రాక్ సినిమా హిట్ తో దూకుడు పెంచాడు. యంగ్ హీరోల‌కు ధీటుగా .. వ‌రుస బెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. అదే స్పీడ్ ఏక‌ధాటిగా గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాలు కంప్లీట్ చేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు. చేతినిండా సినిమాలు ఉన్న ఈ స్టార్ హీరో.. త‌న‌ క్రేజ్ ను క్యాష్ చేయాల‌నుకోవాల‌ని భావిస్తున్నారు.

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రామారావు, ఖిలాడి సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల త‌ర్వాత ఆయ‌న ఒక బ‌యోపిక్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో క్రూర‌మైన ఓ దొంగ‌గా క‌నిపించ‌బోతున్నాడు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే ఒక గ‌జ‌దొంగ క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారట‌. నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

వ‌రుస‌గా హిట్లు కొడుతున్న మాస్ మహారాజా ఈ చిత్రం కోసం భారీగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రాక్ తర్వాత రవితేజ సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో పాటు రవితేజ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ రీజన్స్ వల్లే రవితేజ పారితోషికంను పెంచినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ టాక్ ప్ర‌కారం.. ఈ సినిమా కొరకు రవితేజ ఏకంగా 18 కోట్ల రూపాయల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news