Ravi Teja: మారెడుమిల్లిలో అడవుల్లో రామారావు ఆన్ డ్యూటీ..

-

Ravi Teja: టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ ఏడాది క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో మంచి జోష్ మీద ఉన్నాడు. త‌గ్గేదేలే అంటున్న‌ట్లు కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తూ.. కుర్ర హీరోలు సైతం షాక్ గురి చేస్తున్నారు.  ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటే.. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఫైనల్ షెడ్యూల్ యాక్ష‌న్ సీక్వెన్సెస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం.. చిత్రయూనిట్ మారెడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఎంచుకుంది చిత్ర యూనిట్. ఈ షూటింగ్ అనంత‌రం.. విదేశాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుప‌నున్న‌ట్టు మూవీ మేక‌ర్స్ తెలిపారు.

మ‌రీ అడవిలో రామారావు పోరాటం ఎందుకోసం? ఎవ‌రి కోసం అనేది తెలుసుకోవాలంటే.. మ‌రికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

ఇక ర‌వితేజ సినిమాల విషయానికి వ‌స్తే.. ఖిలాడి రిలీజ్కు రెడీగా ఉంది. అలాగే త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. అలాగే టైగర్ నాగేశ్వరరావ్ అనే సినిమా కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version