తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గా డాక్టర్ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు డీహెచ్‌గా కొనసాగిన గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. కొత్త డీహెచ్‌గా రవీంద్ర నాయక్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యకేషన్‌గా రమేశ్‌రెడ్డి స్థానంలో త్రివేణిని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాస్ రావు.. ఎక్కువగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలకడం.. అదేవిధంగా కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ కూడా ఆశించడం వివాదస్పదం అయ్యాయి. దీంతో తెలంగాణకు కొత్త హెల్త్ డైరెక్టర్ గా డాక్టర్ రవీంద్ర నాయక్ నియామం అయ్యారు. ఇన్ చార్జీ డీఎంఈగా డాక్టర్ త్రివేణి బాధ్యతలను స్వీకరించారు.