అప్పుల పాలైంది..చిప్ప చేతికి వచ్చిందని చిల్లర మాటలు వద్దు – రేవంత్‌ కు అక్బరుద్దీన్‌ వార్నింగ్‌

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రేస్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది. పరిశ్రమలు రావు బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తది పిల్లి శాపనార్థాలు పెట్టి దేశానికి తెలంగాణను చిన్నగ చేసి చూపెట్టాడు.తెలంగాణ తొలి కాంగ్రేస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ గదే పాట మొదలుపెట్టిండు. రాష్ట్రం అప్పుల పాలయింది,చిప్ప చేతికి వచ్చింది అని చిల్లర మాటలు మాట్లాడుతూ,శ్వేతా పత్రాల పేరిట చిల్లర వేషాలు వేస్తూ..  రాష్ట్రానికి ఉన్న పరపతిని దెబ్బ తీస్తున్నాడు.

కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ దేశంలోనే గొప్పగా నిలబడ్డది ఈ రోజు. మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలో తెలియక ఎవరి మీదనో నెపం నెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర పరువును, ప్రతిష్టను దెబ్బతీయకండి. మీ కాంగ్రెస్ పార్టీ తోనే 10 ఏండ్లు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మళ్ళీ మీరు తెలంగాణను మీ మాటలతో చేతలతో వెనక్కి నెట్టకండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. వీలయితే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం కంటే గొప్పగా చేసి చూపెట్టండి. ఉన్న విలువ తీయకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version