RAVITEJA : 10 తలల ”రావణాసురా” గా వస్తున్న మాస్ మహరాజ్

-

టాలీవుడ్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ… క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. క్రాక్ లాంటి భారీ హిట్ తర్వాత రవితేజ అ వరుసగా ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే రమేష్‌ వర్మ దర్శకత్వం లో చేస్తున్న ఖిలాబీ సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. ప్రస్తుతం షూటింగ్‌ దశ లో రామారావు ఆన్‌ డ్యూటీ, ధమాకా సినిమాలున్నాయి. ఈ నేపథ్యం లోనే రవితేజ కెరీర్‌ లో 70 వ సినిమా కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది.

ఈ సినిమా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రవితేజ హీరోగా నటిస్తున్న 70 వ సినిమా ఇది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ మీద అభిషేక్‌ నామా, శ్రీకాంత్‌ విస్సా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా టైటిల్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు ”రావణాసుర” అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసినట్లు ఫస్ట్‌ లుక్‌ కూడా వదిలింది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లో రవితేజ 10 తలలతో రావణాసుర గా కనిపించాడు. భయకరమైన బ్యాక్ గ్రౌండ్‌ లో రవితేజ ఒక లాయర్‌ లుక్‌ లో సీరియస్‌గా చూస్తున్నాడు. ఇక చుట్టూ ఉన్న తొమ్మిది ముఖాలు కూడా అదే ఇంటెన్సివ్‌ లుక్‌ తో కనిపించాయి. మొత్తానికి ఈ సినిమా యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరక్కెతున్నట్లు ఈ పోస్టర్‌ చూస్తే.. కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news