ఆర్‌బీఐ నుంచి మరో అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక నుంచీ..

-

ఇటీవ‌ల నెఫ్ట్ సేవలు 24 గంటలూ.. 365 రోజులూ నిరంతరాయంగా అందుబాటులోకి వచ్చిన విష‌యం తెలిసిందే. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో కూడా నెఫ్ట్ ద్వారా నగదును ఏ క్షణమైనా బదిలీ చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా.. బ్యాంకు ఖాతాదారులకు భారతీయ రిజర్వు బ్యాంకు మ‌రో శుభ‌వార్త తీసుకువ‌చ్చింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సేవలను 24 గంటలూ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్‌బీఐ తాజాగా నెఫ్ట్ చార్జీలను ఎత్తివేస్తూ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇకపై నెఫ్ట్ లావాదేవీలకు ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు వివరించింది. కాగా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులతోపాటు మరికొన్ని బ్యాంకులు గత కొంతకాలంగా నెఫ్ట్ చార్జీలను వసూలు చేయడం లేదు. ఆర్బీఐ తాజా ఆదేశాలతో ఈ సేవలను అన్ని బ్యాంకులు ఇకపై ఉచితంగా అందించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news