జగన్ వ్యూహంతో చంద్రబాబు షాక్ అయ్యారా…?

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాదాపుగా ఆత్మరక్షణలో పడింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మూడు రాజధానులు ఉండవచ్చు అని జగన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా తెలుగుదేశం నేతలు కంగారు పడుతున్నారు. వైజాగ్, అమరావతి, కర్నూలు మూడు ప్రాంతాల్లో రాజధాని ఉంటుంది అని జగన్ అన్నారు. ఆ తర్వాత తెలుగుదేశంలో ప్రాంతాల వారీగా నేతలు స్పందించారు. ఉత్తరాంధ్ర నేతలు కొందరు జగన్ నిర్ణయానికి మద్దతు పలికారు.

ఇక రాయలసీమ నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేసారు. అది పక్కన పెడితే… అమరావతిని ఇన్నాళ్ళు సమర్ధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సమర్ధించలేకపోతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. విశాఖ, కర్నూలు వద్దని చెప్తే మాత్రం… ప్రాంతాల వారీగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది… అలా అని ఆ నిర్ణయానికి కృష్ణా గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల నేతలు మాట్లాడితే తమ ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రాంతాల మధ్య ఇది పార్టీలో చీలిక తెచ్చే అవకాశం ఉంది.

దీనితో అసలు జగన్ నిర్ణయం అమలు అయ్యే అవకాశం లేదు, సౌత్ ఆఫ్రికా మోడల్ అనేది బాగుండదు అనే ప్రచారం తెలుగుదేశం చేయడమే కాకుండా జగన్ పాలన మీద విమర్శలు చేయడం మొదలుపెడుతుంది. చంద్రబాబు కూడా ఈ విషయంలో కాస్త ఆత్మరక్షణ లో పడ్డట్టే కనిపించారు. రాజధాని ఒక చోట ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం నేతలు కొందరు… ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు… ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారు అని మాట్లాడుతుంది. దీని ప్రకారం చూస్తే జగన్ వ్యాఖ్యలు విపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి అనే విషయం అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news