ఆర్బీఐ గవర్నర్: రూ. 2000 నోటును అందుకే రద్దు చేశాము…

-

గతంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చలామణిలో ఉన్న రూ. 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ. 2000 నోటును తీసుకురావడం జరిగింది. ఈ మార్పుపై ప్రజలు పాత రూ. 1000 నోట్లను మార్చుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. అయితే కొంతకాలం తర్వాత తాజాగా తీసుకున్న నిర్ణయంతో మళ్ళీ ప్రజలకు షాక్ ఇచ్చారు. గత వారం రూ. 2000 నోటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ఎవరికీ తోచిన కారణాలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాగా తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము అన్న విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. మేము రూ. 2000 నోటును ఎందుకు తీసుకువచ్చాము అన్న టార్గెట్ నెరవేరిందని.. అందుకే ఇప్పుడు రద్దు చేస్తూ ప్రకటన ఇచ్చామని శక్తికాంత దాస్ తెలిపారు.

అప్పట్లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలకు ఇబ్బ్బంది కలుగకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో రూ. 2000 నోటును తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు ప్రజలకు డబ్బు బాగా అందుబాటులో ఉందని, అందుకే రూ. 2000 నోటును రద్దు చేశామని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version