యెస్‌ బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట..!

-

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ కస్టమర్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించడంతో కస్టమర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే త్వరలో ఆ కష్టాలు కొంత వరకు తీరనున్నాయి. ఎందుకంటే.. యెస్‌ బ్యాంకుపై విధించిన మారటోరియాన్ని మార్చి 18 నుంచి ఎత్తివేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ మేరకు ఆర్‌బీఐ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

యెస్‌ బ్యాంకును పునరుద్ధరించేందుకు శుక్రవారం పలు బ్యాంకులు ముందుకు వచ్చిన విషయం విదితమే. ఎస్‌బీఐతోపాటు యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు యెస్‌ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో యెస్‌ బ్యాంకుపై మారటోరియాన్ని ఎత్తి వేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. కాగా ప్రస్తుతం యెస్‌ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్‌ కుమార్‌ ఆ బ్యాంకు బోర్డు ఎండీ, సీఈవోగా పనిచేయనున్నారు. ఈ క్రమంలో సంక్షోభంలో ఉన్న యెస్‌ బ్యాంకును గట్టెక్కించేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐలు వేగంగా చర్యలను చేపట్టడం విశేషం.

ఇక యెస్‌ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు రూ.7250 కోట్లను ఎస్‌బీఐ పెట్టుబడి పెట్టనుండగా, మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు చెరో రూ.1000 కోట్లను, యాక్సిస్‌ బ్యాంకు రూ.600 కోట్లను, కోటక్‌ మహీంద్రా బ్యాంకు రూ.500 కోట్లను పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ క్రమంలో అన్ని లావాదేవీలు పూర్తయితే యెస్‌ బ్యాంకులో ఈ ఐదు బ్యాంకుల వాటానే 70 శాతంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version