‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకుందా , తప్పించారా ..?

-

తెలుగు, తమిళంలో దాదాపు త్రిష సినీ కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలో 96 సినిమాతో అనూహ్యంగా హిట్ అందుకుంది. మంచి కంబ్యాక్ మూవీగా త్రిషకి మళ్ళీ మంచి క్రేజ్ ని తీసుకు వచ్చింది. దాంతో త్రిషకు మళ్ళీ స్టార్స్ తో నటించే అవకాశాలు బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య లో నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ కూడా అదే కన్‌ఫర్మ్ న్యూస్ గా కూడా చెప్పారు. అయితే రీసెంట్ గా ఆచార్య సినిమా నుండి త్రిష తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది.

 

అందుకు కారణం ముందు ఆచార్య కథను త్రిషకు చెప్పిన సమయంలో చరణ్ పాత్ర పెద్దగా లేదట. గెస్ట్ పాత్రగానే ఆ పాత్ర ఉంటుందని దర్శకుడు కొరటాల చెప్పాడట. కాని ఇప్పుడు చిరంజీవి సూచన మేరకు ఆ పాత్రను బాగా డెవలప్ చేసి పాత్ర నిడివి పెంచారట. చరణ్ పాత్రను పెంచడంతో ఆయనకు ఒక హీరోయిన్ రెండు పాటలు.. యాక్షన్ సీన్స్ తో పాటు మరి కొంత టాకీ పార్ట్ కూడా పెంచారట. ఈ సమయంలో త్రిషకు సంబంధించిన పాత్ర మొత్తం మారిందని తెలుస్తోంది. దాంతో పాటు ఆమె స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా తగ్గిందట. దాంతో తన పాత్రకి ఇంపార్టెన్స్ లేదని ఫీలయిందట త్రిష.

చరణ్ కోసం ఆచార్యలో త్రిష పోషిస్తున్న పాత్ర ప్రాముఖ్యత తగ్గించారన్న కారణంతోనే ఆమె తప్పుకుందని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది దర్శక, నిర్మాతల ప్లాన్ అని త్రిష కి అర్థమవటంతో మెగాస్టార్ హీరో అయినప్పటికి ప్రాముఖ్యత లేని పాత్ర చేస్తే తనకి ఎంతమాత్రం ఉపయోగం ఉండదనే త్రిష నిర్మొహమాటంగా తప్పుకుందని అంటున్నారు. అయితే ఇదే విషయాన్ని మరికొంతమంది త్రిష తప్పుకోలేదు. చియ్ర యూనిట్ కావాలనే తప్పించారని అంటున్నారు. అయితే ఎందుకు అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version