RC 16 మూవీ కోసం భారీ సెట్ నిర్మాణం

-

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజ్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తూ ఉన్నారు. ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా RC 16 టైటిల్తో ఓ చిత్రం వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లు లో మూవీ యూనిట్ ఓ భారీ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.సాంగ్స్ షూటింగ్ తో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.

ఈ మూవీని అధికారికంగా ప్రారంభించిన కూడా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.జూన్ లో రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.అయితే ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news