2017 కంటే ముందు నుంచే ఫోన్ ట్యాపింగ్ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

బీఆర్ఎస్ లాంటి కుటుంబ పార్టీలు ఉండకూడదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన బీఆర్ఎస్ ను డిజాల్వ్ చేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తానని ఆయన అన్నారు. శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ …ఒకే కుటుంబం నుంచి ఐదారుగురు పాలించిన ఘటన తెలంగాణలోనే జరిగిందని అన్నారు. 2017 కంటే ముందు నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు.

2018లో బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతో ఎంతో మందిని హింసించారని ,ఫోన్ ట్యాపింగ్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడేనని ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులను శిక్షంచకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్య ఒప్పందం ఉందని ప్రజలకు అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్.. వ్యాపారులను హింసించి డబ్బు వసూలు చేసిందని ,టెలిగ్రాఫ్ యాక్ట్ పాటు ఇతర చట్టాల కేసు నమోదుచేయాలని కొండా డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news