సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే పటాన్చెరువు మండలం పాస మైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీఎం హెచ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేరుంది ఈ సమయంలో పరిశ్రమంలో 15 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పరిశ్రమతో పాటు పక్కనే ఉన్న వనమాలి ఫార్మ పరిశ్రమకి కూడా మంటలు వ్యాపించాయి దీంతో రెండు పరిశ్రమల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకి పరుగు పెట్టారు.
ఈ ఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఇస్నాపూర్ లో కాకతీయ హాస్పిటల్ కి పటాన్చెరు లోని పోలార్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. రెండు కర్మాగారాల్లో మంటలు వ్యాపించడంతో సీనియర్ అగ్నిమాపక అధికారులు ఆదేశాల మేరకు అగ్నిమాపక యంత్రాలని పంపించారు. మంటల ని అదుపు చేయడానికి సహకరించిన కార్మికులు రసాయనాలు పీల్చి అస్వస్థకు గురయ్యారు వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.