అనారోగ్యాల బారి నుంచి తప్పించుకోవాలంటే ఈ స్తోత్రం పఠించండి..

-

ప్రతి ఒక్కరు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి వీటిని భక్తితో చదివితే వారికి అనారోగ్య సమస్యలు రావు. వచ్చిన వారికి వాటి నుంచి విముక్తి లభిస్తుందని భవిష్యపురాణం పేర్కొంది.

ఈ రోజుల్లో ఆరోగ్యం పెద్ద సమస్యగా పరిణమించింది. ఐశ్వర్యాలలో ఒకటి ఆరోగ్యం. ధనం లేకున్నా పర్వాలేదుకానీ అరోగ్యం ఉంటే చాలు అనుకునే రోజులివి. ఆరోగ్యం కోసం వైద్యశాల చుట్టూ తిరగడం కంటే ప్రతిరోజు పురాణాల్లో చెప్పిన ప్రక్రియలను పాటిస్తే తప్పక ఆరోగ్యం లభిస్తుంది. వేదాల ప్రకారం ఆరోగ్యంతు భాస్కరం అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేది భాస్కరుడు అంటే సూర్యుడు. ఇదే విషయాన్ని భవిష్యపురాణంలో చూస్తే… సాంబుడు అనేవాడు అనారోగ్యంతో బాధపడి సూర్యభగవానుడిని ఆరాధిస్తాడు. సూర్యసాక్షాత్కరం జరిగిన తర్వాత సూర్య సహస్రనామాల కంటే మించిన 21 నామాలను సాంబుడికి ఉపదేశిస్తాడు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి వీటిని భక్తితో చదివితే వారికి అనారోగ్య సమస్యలు రావు. వచ్చిన వారికి వాటి నుంచి విముక్తి లభిస్తుందని భవిష్యపురాణం పేర్కొంది.

read this elogy to remove health issues

ప్రతి రోజు స్నానానంతరం పఠించాల్సిన సూర్యభగవానుడి స్తోత్రం…

వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః
లోకప్రకాశకః శ్రీమాన లోక చక్షుర్గ్రహేశ్వరః
లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా
తపన స్తాపనశ్చైవ శుచి స్సప్తాశ్వవాహనః
గభస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవనమస్కృతః
ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమ
శరీరారోగ్యద శ్చైవ ధనవృద్ధి యశస్కరః
స్తవరాజ ఇతి ఖ్యాతస్రీషులోకేషు విశ్రుతః

పై శ్లోకాన్ని సంధ్యాకాలాలలో పఠించినవారు సర్వపాప విముక్తులవుతారు. ధనవృద్ధి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక ఆలస్యమెందుకు సూర్యుడికి ఇష్టమైన రోజు అయిన ఆదివారం నుంచి దీన్ని ప్రారంభించండి. అరోగ్యాన్ని పొందండి.

ఓం నమో భాస్కరాయనమః

Read more RELATED
Recommended to you

Latest news