హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్.. ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడి

-

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది.ఇళ్ళ అమ్మకాలు, కొత్త ఇళ్ళ సరఫరాలో హైదరాబాద్ వెనుకబడింది. గతేడాది 2024 జనవరి-మార్చి మధ్య 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది 26 శాతం తగ్గి 10,647 యూనిట్ల ఇళ్ల అమ్మకాలే జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది.

హైదరాబాద్‌లో ఇళ్ళ అమ్మకాలు భారీగా పడిపోగా బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొంది.కొత్త ఇళ్ళ సరఫరాలో సైతం హైదరాబాద్‌లో 33 శాతం తగ్గగా బెంగుళూరులో 83 శాతం పెరిగిందని స్పష్టంచేసింది. ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిల్డర్లను పెద్ద ఎత్తున కమీషన్లు అడుగుతోందని.. హైడ్రా పేరుతో కూల్చివేతల కారణంగా బిల్డర్లు వెనక్కి తగ్గుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news