. ఇస్తానన్న తులం బంగారం అడిగితే.. ఇలా హింసిస్తారా? : మాజీ మంత్రి హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చెప్పినట్లుగా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తానన్న తులం బంగారం ఏమైందని అడిగితే ఇంత దారుణంగా హింసిస్తారా? అని మంత్రి జూపల్లి కృష్ణారావును మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

తులం బంగారం ఏమైందని భీంగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి జూపల్లిని ప్రశ్నించిన వారిపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అనుచరులు, పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news