జూన్‌ 20న లాంచ్‌ కానున్న Realme C30 బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్.. !

-

రియల్‌మీ మనదేశంలో తన బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేయడానికి రెడీ అయింది. సీ30ని లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ ఫోన్ ఇప్పటికే ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఇందులో ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా చూడవచ్చు.

రియల్‌మీ సీ30 ఫీచర్లు..

రియల్‌మీ సీ30 స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా… 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
రియల్‌మీ సీ30 మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 181 గ్రాములుగా ఉంది.
ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఈ ఫోన్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ఒక వేరియంట్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ఒక వేరియంట్ లాంచ్ కానుంది.
ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
ఫీచర్లను బట్టి చూస్తే రియల్‌మీ సీ30 ధర రూ.8 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌కు సంబంధించి అధికారిక రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ కిందివైపు అంచు బాగా మందంగా ఉంటుంది. ఫోన్ వెనకవైపు ప్రత్యేకమైన డిజైన్ అందించారు. రియల్‌మీ బ్రాండింగ్, వెనకవైపు కెమెరాను కూడా చూడవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించలేదు. స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ , మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లూ, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రియల్‌మీ తన సోషల్ మీడియా చానెళ్ల ద్వారా విడుదల చేసింది. జూన్ 20వ తేదీన మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version