తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కొత్త పెట్టాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల జీతాల్లో కూడా కొత్త పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. కరోనా వైరస్ నేపధ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు అవుతుంది. దీనితో భారీగా వ్యాపారాలు పడిపోయాయి. అన్ని రంగాలు కూడా ఇప్పుడు కరోనా కారణంగా కూలిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి ఆగిపోయింది. ఆదాయం రావడానికి వచ్చే మార్గాలు అన్నీ కూడా దాదాపుగా ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పట్లో లాక్ డౌన్ ని ఎత్తివేసే అవకాశాలు కనపడటం లేదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బంది పడటం ఖాయంగా కనపడుతుంది. ఒక పక్క ప్రజలకు రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దీనితోనే కేసీఆర్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగుల జీతాల్లో దాదాపు 40 శాతం వరకు కోత విధించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ తమ వంతు బాధ్యత పంచుకోవాలని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్దం చేసినట్టు సమాచారం. అందరి జీతాలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించి దీనిపై నిర్ణయం వెల్లడించే సూచనలు కనపడుతున్నాయి.