తస్మాత్ జాగ్రత్త.. ఈ కారణంతోనే గుండె సమస్యలు ఎక్కువవుతున్నాయి..!

-

ఈ రోజుల్లో చాలా మంది గుండె సమస్యల తో బాధ పడుతున్నారు. చాలా మంది గుండె పోటు రావడం వలన చనిపోతున్నారు. గుండె జబ్బులు కారణంగా మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు వలన ఒత్తిడి బాగా పెరిగి పోతుంది. ఒత్తిడి కారణంగా గుండె సమస్యలు పెరుగుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా పని తీరు లో మార్పు ఎక్కువ వచ్చింది.

ఎక్కువ గంటలు పని చేయడం నైట్ షిఫ్ట్ లు ఇటువంటి వాటి వల్ల ఒత్తిడి బాగా పెరుగుతుంది ఒత్తిడి వలన చాలా మంది అనేక సమస్యలకు గురవుతున్నారు. ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు కూడా బాగా పెరుగుతున్నాయి. నిపుణులు చెప్పిన దాని ప్రకారం వారానికి 55 గంటల కంటే ఎక్కువ సేపు పని చేస్తే ఒత్తిడి విపరీతంగా ఎక్కువవుతుంది.

అధ్యయనాల ప్రకారం ఎక్కువగా పని చేసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది 55 గంటల కంటే ఎక్కువ పని చేయడం వలన స్ట్రోక్ వచ్చే ముప్పు 35% ఉంటుంది. గుండెపోటు ముప్పు 17% పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి అందుకోసం సాధన చేయాలి. ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఆ టైం లోనే పని చేయాలి మిగిలిన సమయంలో రిలాక్స్డ్ గా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version