నిద్రపోయేప్పుడు మొబైల్‌ దిండు కిందే పెట్టుకుంటున్నారా..?

-

మనిషి ఎప్పుడూ దేనికో ఒకదానికి ఎడిక్ట్‌ అయి ఉంటాడు. ఒక్కో స్టేజ్‌లో ఒక్కోటి.. కానీ దాదాపు అన్నీ స్టేజ్‌లలో ఫోన్‌కు మాత్రం బానిసైపోయాడు. కాలేజ్‌కు వెళ్లే టైమ్‌ నుంచి.. కాటికి వెళ్లే వరకూ అందరూ మొబైల్‌ ఫోన్లను వారి జీవితంలో భాగం చేసుకున్నారు. పొద్దున్నంత వాడింది సరిపోలేదని.. రాత్రి నిద్రపోయేప్పుడు కూడా దిండు కిందనే పెట్టుకుని పడుకుంటారు. దూరంగా విడిచిపెట్టి నిద్రపోలేరు. అలారం మోగితే వినపడాలని, పొద్దున్నే లేవగానే టైమ్‌ ఎంత అయిందో చూడాలని ఇలా వివిధ కారణాల వల్ల నిద్రపోయే ముందు దిండు కింద అణుబాంబును పెట్టుకుని నిద్రపోతున్నారు. అణుబాంబు ఏంటి అనుకుంటున్నారా..? మీ ఫోన్‌ అంత డేంజర్‌ మరీ..! ఈ అలవాటు వల్ల కలిగే నష్టాలు ఏంటో మీరే చూడండి.!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 90 శాతం మంది యువత, 68 శాతం మంది పెద్దలు తమ దిండు కింద మొబైల్ ఫోన్‌తో నిద్రపోతారు. మొబైల్ ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మొబైల్ ఫోన్ రేడియేషన్ ఆరోగ్యానికి ప్రమాదకరం. నిద్రించే సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచడం మంచిది. వీలైతే నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్‌లను కనీసం 3 అడుగుల దూరంలో ఉంచడానికి ప్రయత్నించండి.

ఇది మొబైల్ ద్వారా వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత శక్తిని తగ్గిస్తుంది. దగ్గరలో మొబైల్ ఫోన్లు పెట్టుకుని నిద్రించడం వల్ల వచ్చే మరో ప్రమాదం ఏమిటంటే, మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ కండరాల నొప్పులు, తలనొప్పికి దారి తీస్తుంది. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే నీలి కాంతి నిద్రను ప్రేరేపించే హార్మోన్‌లకు అంతరాయం కలిగిస్తుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.

నిద్రించేప్పుడు ఎట్టిపరిస్థితుల్లో ఫోన్ తల పక్కన పెట్టుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దాని నుంచి వచ్చే రెడియేషన్‍తో నిద్రలేమి, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. అంతేకాదు డిప్రెషన్, ఒత్తిడితో పాటు ఇతర మానసిక వ్యాధులు కూడా వస్తాయి. పగలంతా పక్కన పెట్టుకుని, రాత్రి కూడా పక్కన పెట్టుకుని ఉంటే ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. వీలైనంతవరకూ ఫోన్లు వాడకం తగ్గించడం మంచిది. అవసరానికి వాడటం వేరు అవసరానికి మించివాడటం వేరు. మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో గమనించుకోండి.!

Read more RELATED
Recommended to you

Latest news