శివసేన లో రెబల్ ఎమ్మెల్యేలు ఇంకా పెరుగుతారు: విజయశాంతి

-

మహారాష్ట్రలో తాజా రాజకీయాలపై బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ, నటి విజయశాంతి స్పందించారు.” మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ లతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీ లో చోటుచేసుకున్న తిరుగుబాటు ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు. సీఎం ఉద్దవ్ నాయకత్వంలోనే శివసేన లో రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతోంది. సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూడునాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ఈ సంక్షోభం రుజువు చేసింది.

లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్దవ్ తండ్రి బాల్ థాకరే శివసేన పార్టీ స్థాపించారు. పొత్తులు, సంకీర్ణ సర్కారుపై ఆయన గతంలో స్పందిస్తూ ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కారుకు నేతృత్వం నిర్వహించాలని కూడా స్పష్టంగా చెప్పారు. ఉద్ధవ్ ఇవన్నీ తుంగలో తొక్కి కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారు.” అని ట్విట్టర్ వేదిక ద్వారా పేర్కొన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version