ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. వేడి వేడిగా ఆపిల్ బజ్జీలు

-

కావాల్సిన‌ పదార్ధాలు: 
యాపిల్స్ – 3
వరిపిండి – రెండు టేబుల్‌ స్పూన్‌
శనగపిండి – పావుకిలో
ఉప్పు – తగినంత
కారం – ఒక టీ స్పూన్‌
ధనియాల పొడి – ఒక టీ స్పూన్‌
జీలకర పొడి – అర టీ స్పూన్‌
నూనె – సరిపడా

తయారీ విధానం: 
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, వరిపిండి, జీలకర పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు, నీళ్ళు వేసి జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత యాపిల్స్‌ను శుభ్రంగా కడిగి గుండ్రంగా లేదా మ‌న‌కు న‌చ్చిన విధంగా ముక్కలు కోసుకోవాలి.

ఆ త‌ర్వాత స్టౌ మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక యాపిల్‌ ముక్కల్ని పిండిలో ముంచి బజ్జీలుగా వేసుకోవాలి. గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు ఫ్రై చేసి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన వేడి వేడి ఆపిల్ బ‌జ్జీలు రెడీ. వీటిని జామ్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version