షాకింగ్… 74 ఏళ్లకు గర్భం దాల్చిన వృద్ధురాలు..!

-

చాలామంది మహిళలు 70 ఏళ్లు దాటితో మంచానికే పరిమితం అవుతారు. కనీసం లేవలేరు కూడా. తమ పనులు తమ తాము చేసుకోలేరు. కానీ.. ఈ వృద్ధురాలు మాత్రం ఏకంగా 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది.

కొన్ని సంఘటనలు మనకు షాకింగ్ గానే అనిపిస్తాయి. అసలు అది ఎలా సాధ్యం అయింది అని నెత్తిగోక్కుంటాం. అలా జరగడం అసాధ్యం కదా అని అనుకుంటాం. కానీ.. ఈ సృష్టిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక పరిధి గీసుకొని కూర్చోలేం. అందుకే.. కొన్ని కొన్ని వింత ఘటనలు ఈ ప్రపంచంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి. వాటిని చూసి మనం నోరు తెరవడం తప్పించి ఇంకేం చేయలేం. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే… ఓ వృద్ధ మహిళ… వయసు 74 దాకా ఉంటాయి. అందులో ఏం విశేషం లేదు కానీ… ఈ వయసులో ఆ వృద్ధురాలు తల్లి కాబోతోంది. అదే ఇక్కడ సెన్సేషన్. 74 ఏళ్ల వయసులో తల్లికావడం అనేది నిజంగా చాలా అరుదు.

చాలామంది మహిళలు 70 ఏళ్లు దాటితే మంచానికే పరిమితం అవుతారు. కనీసం లేవలేరు కూడా. తమ పనులు తమ తాము చేసుకోలేరు. కానీ.. ఈ వృద్ధురాలు మాత్రం ఏకంగా 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్నది.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మకు పెళ్ల అయిన తర్వాత పిల్లలు కాలేదు. పిల్లల కోసం దశాబ్దాల పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసింది. కానీ… ఫలితం దక్కలేదు. చివరకు ఇప్పుడు అంటే 74 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చింది. అది కూడా కృత్రిమ గర్భధారణ ద్వారా గర్భం దాల్చి తను తల్లి అయ్యే అవకాశాన్ని పొందింది.

ప్రస్తుతం ఆమెను 9 నెలలు నిండాయి. వయసు ఎక్కువకావడంతో సాధారణ ప్రసవం జరిగే పరిస్థితి లేదు కనుక, డాక్టర్లు ఈరోజు సిజేరియన్‌ ఆపరేషన్ చేయనున్నారు. 74 ఏళ్ల వయసులో బిడ్డను కన్న మొట్టమొదటి మహిళగా ఆమె మరి కాసేపట్లో ప్రపంచ రికార్డు సాధించనున్నారు. ఇదివరకు 70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. తన కడుపులో ఉన్నది ఒక బిడ్డ కాదు.. ఇద్దరు.. అవును.. తన కడుపులో కవలలు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. వావ్.. సూపర్ కదా. 74 ఏళ్ల వయసులో కవల పిల్లలకు తల్లి కాబోతున్న మంగాయమ్మ నిజంగా గ్రేట్. మాతృత్వాన్ని ఇన్నేళ్లకు అనుభవించబోతున్న ఆ తల్లికి ముందుగానే కంగ్రాట్స్‌ తెలుపుతోంది ‘మనలోకం’.

Read more RELATED
Recommended to you

Exit mobile version