కొవొవాక్స్ అత్య‌వ‌స‌ర వినియోగానికి నిపుణులు కమిటీ సిఫార్సు

-

భార‌త్ లో మ‌రో టీకా అందుబాటులోకి రానుంది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేసిన కొవొవాక్స్ టీకాను అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ వ‌చ్చ‌ని నిపుణుల క‌మిటీ.. డీసీజీఐకి సిఫార్సు చేసింది. ఈ టీకాను 12 నుంచి 17 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారికి పంపిణీ చేయ‌వ‌చ్చ‌ని నిపుణుల క‌మిటీ తెలిపింది. కాగ కొవొవాక్స్ ను 12 నుంచి 17 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారికి పంపిణీ చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని సీరం ఇన్ స్టిట్యూట్.. ఫిబ్ర‌వ‌రి 21న నిపుణుల క‌మిటీకి ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

కాగ నిపుణుల క‌మిటీ ఈ ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించి.. కొవొవాక్స్ ను అధ్య‌యానం చేసిన త‌ర్వాత‌.. అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌వ‌చ్చ‌ని.. డీసీజీఐ కి సూచించింది. కాగ దీన్ని డ్రగ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ఆమోదించాల్సి ఉంది. అయితే కొవొవాక్స్ ను పెద్ద‌ల‌కు పంపిణీ చేయ‌డానికి గ‌త ఏడాది డిసెంబ‌ర్ నెల‌లోనే డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది. అయితే మ‌న దేశ టీకా కార్యక్ర‌మంలో కొవొవాక్స్ ను ఇంకా చేర్చ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version