ఏపీ హైకోర్టు జడ్జీలుగా 7గురు న్యాయవాదులు..సుప్రీం కొలీజియం సిఫారస్‌

-

సుప్రీం కోర్టు… కొలీజియం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టుకు ఏడుగురు న్యాయ మూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు కొలీజియం సిపార్సు చేసింది. ఈ నెల 29 వ తేదీన సమావేశం అయిన సుప్రీం కోర్టు… కొలీజియం ఏడుగురు న్యాయ వాదులకు పదోన్నతి కల్పిస్తూ.. జడ్జీలుగా నియమించాలంటూ.. సిపార్సు చేసింది.

ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన చేసింది సుప్రీం కోర్టు… కొలీజియం. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్‌ రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమల పాటి రవితో పాటు… వడ్డి బోయిన సుజాత పేర్లను సుప్రీం కోర్టు… కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు… కొలీజియం ప్రకటనతో ఏడుగురు న్యాయ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సిఫారసులు వచ్చే నెల నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయడానికి అయినా.. సుప్రీం కోర్టు… కొలీజియం జోక్యం కచ్చితంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news