రికార్డులు బద్దలు కొట్టిన సర్కారు వారి పాట.. !

-

ప్రిన్స్ మ‌హేశ్ బాబు దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారి పాట. నిన్న సోమ‌వారం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఓ వీడియోను విడుదల చేశారు. బర్త్ డే బ్లాస్టర్ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో టాలీవుడ్ లో అత్యధిక వ్యూవ్స్ తో రికార్డులు బద్దలు కొడుతోంది. గడచిన 24 గంటల్లో ఈ వీడియోకు 25.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా 7 లక్షలకు పైగా ఈ వీడియోను లైక్ చేశారు. దాంతో టాలీవుడ్ 24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూవ్స్ సంపాదించిన వీడియోగా నిలిచింది.

sarkaru vari pata vodeo records
sarkaru vari pata video records

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న‌ ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు చిత్ర యూనిట్ స్ప‌ష్టం చేసింది. ఇక తాజాగా మహేష్ బర్త్ డే కు రిలీజ్ చేసిన వీడియోతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా నుండి వీడియో వ‌స్తేనే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా విడుద‌ల‌య్యాక టాలీవుడ్ రికార్డులను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news