తెలంగాణలో తాజ్ మహల్ ఉందంటూ పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకునే నేపథ్యంలో…. తెలంగాణలో తాజ్ మహల్ ఉందంటూ మహిళా సమాఖ్య ఉద్యోగి ఈ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అధ్బుతంగా ఉన్నవి చూపించాలి అంటే ఒకటి తాజ్ మహల్, రెండు మహిళా సంఘాలు ఉన్నాయని పేర్కొన్నారు జిల్లా మహిళా సమాఖ్య ఉద్యోగి.

దీంతో… మహిళా సమాఖ్య ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే… ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. హైదరాబాద్‌కు, తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉన్నదని అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు వైరల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో తాజ్ మహల్ ఉందంటూ పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.