రికార్డు సృష్టించిన తెలంగాణ ఆర్టీసీ.. ఒక్కరోజే రికార్డ్ స్థాయి ఆదాయం

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ మళ్ళీ లాభాల పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్న సోమవారం రోజున రికార్డు స్థాయిలో ఆదాయం నమోదు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. సోమ వారం ఆర్టీసీ రికార్డు స్థాయిలో 77.06 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసింది.

గత సంవత్సరం ఆర్టీసీ చార్జీలు పెంచిన తరువాత ఆదాయం పెరగడం ఇదే మొదటి సారి. సోమవారం రూ. 12.89 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 14.07 కోట్ల ఆదాయం నమోదు చేసింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. గ తేడాది ఇదే రోజున 7.85 కోట్లు మాత్రమే ఆదాయం రాగా ఈ ఏడాది మాత్రం భారీగా పెరిగింది. పది రిజియన్లలో లక్ష్యానికి మించి ఆదాయం దక్కించుకుంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా.. ఐపీఎస్ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి…. తెలంగాణ ఆర్టీసీ లో… చాలా బాగా మార్పు వచ్చింది. ఆయన తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో ఆర్టీసీ సంస్థ దూసుకెళుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో అనుసరించిన ఈ విధంగానే సజ్జనార్ ఆర్టీసీ లోనూ వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version