ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలి : కూనంనేని సాంబశివరావు

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకి సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు మద్ధతు తెలిపినట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. శనివారం ముఖ్యమంత్రి సమక్షంలో 3 పార్టీల కీలక నాయకులతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించాలని పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలి. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలలి. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నా రు.

Read more RELATED
Recommended to you

Latest news