RECORD: స్టేడియంకు వచ్చి వరల్డ్ కప్ ను చూసిన వారెంతమందో తెలుసా ?

-

వన్ డే వరల్డ్ కప్ 2023 గత ఆదివారంతో ముగిసిపోయింది. ఇండియా ఆతిధ్యం ఇచ్చినా కప్ ను సాధించడంలో విఫలం అవడంతో అభిమానులు ఈ షాక్ నుండి తేరుకోలేకపోతున్నారు. ఈ వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు మొత్తం 45 లీగ్ మ్యాచ్ లు, రెండు సెమి ఫైనల్ మ్యాచ్ లు మరియు ఒక్క ఫైనల్ మ్యాచ్ జరిగాయి. ఇక ఐసీసీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ వరల్డ్ కప్ ను 1250307 మంది అభిమానులు స్టేడియం కు వచ్చి చూశారు. ఇది ఇప్పటి వరకు ఏ వరల్డ్ కప్ లో అయినా అత్యధిక మంది చూడడం లో రికార్డ్ అని తెలియచేసింది. ఇక గతంలో జరిగిన 2015 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో జరిగిన వరల్డ్ కప్ ను 1016420 మంది చూశారు. ఇక ఇప్పుడు ఆ రికార్డు బద్దలు కావడం విశేషం అని చెప్పాలి.

ఇక కేవలం ఒక ఫైనల్ మ్యాచ్ ను మాత్రమే 92453 మంది వీక్షించడం గమనార్హం. వేలమంది జనాభా ముంగిట ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశకు గురిచేసింది. ఈ కప్ తో ఆస్ట్రేలియా ఆరవసారి వరల్డ్ కప్ టైటిల్ ను అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news